Devude Kanipinchi Neekami Kavalani ( దేవుడే కనిపించి నీకేమి ) Christian Telugu Song



Devude Kanipinchi Neekami Kavalani adigithay Lyrics

దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే

నీ బదులేమో మానవా ?

ధనము కోరుతావా ఆ..ఆ... ఘనము కోరుతావా ఆ..ఆ... (2)

అల్పకాల పాపభోగములను కోరుతావా || దేవుడే ||


జ్ఞానమును అడిగాడు పాపములో మునిగి

అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆనాడు

బలమును పొందాడు బలవంతుడయ్యాడు

బలహీనతలో పడి పోయాడు సమ్సోను

జ్ఞానులు బలవంతులు బంధీలై పోగా

బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో.

ప్రభు కృపను కోరుతావో... || దేవుడే ||


మన రక్షణ కోరాడు మనకై ఏతెంచాడు

మనస్థానమందు నిలచి మరణించె మనప్రభువు

ఆత్మలను అడిగాడు హతసాక్షి అయ్యాడు

అందరికి మాదిరిని చూపాడు ఆ పౌలు

యేసువైపు చూస్తు నీవు పయనమయోతావో

ఆ దేవుని దయను కోరి ధన్యుడౌతావో.

మరి ఏమి కోరుతావో… || దేవుడే ||

Devude Kanipinchi Neekami Kavalani adigithay ( దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే  ) is a wonderful Telugu Christian Song with lyrics in telugu.

Post a Comment

0 Comments